
శ్రీహరిదాస సంకీర్తనగాన రసామృతము
రచన: శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తి
Please visit my web page for
SriharidAsa_annamAcAri lyrics in Multiple Languages"
హరిభక్తి - వివిధభాషలలో
|
దృశ్యమాన
క్షిత్యంకురాది
అఖిలజగత్తంత విలక్షణ
కార్యము విశ్వాత్మ
విశ్వరూపుడు విశ్వంభరుడైన
విష్ణువునకు. జగద్విలక్షణ
కర్తయగు సర్వప్రమాణ
మూర్థ్యావస్థానమధిష్ఠించిన
పరమాత్మ యునికిని
శ్రుతులన్ని యుద్ఘోషించుచున్నవి
"యతో నా ఇమాని భూతాని
జాయన్తే" యని. మఱియు
విశ్వేశుడు విశ్వాత్మ
విశ్వంభరుడు విశ్వాధారుడు
విశ్వకారకుడైన
పరమాత్మహరి అచ్యుతుడవినాశియే
జగత్తున కభిన్న
నిమిత్తోపాదనమనునే
శ్రుతులు. కాన
నంతటి పరబ్రహ్మజ్ఞానము
నిరవధిసుఖప్రదమేగద.
అట్టి ప్రశాంతిధామమును
పొందుటెలా సాధ్యము? ఈకలియుగములో
నామసంకీర్తనమే
అత్యంతసులభ మార్గమని
పెద్దలు వక్కాణించలేదా!
హరి వర్ణన హరిగుణవర్ణన
చేయటమనేది సాధ్యమైనపని
గాదనుట నిజమైన
విషయమేగదా! కాని
హరినామ స్మరణము
చేయటము ఒకరకముగా
సాధ్యమంటారు.
భక్తి సాధనపద్ధతులలో హరినామసంకీర్తన
చెప్పుకోదగ్గ
పరికరము. ఒకొక్కసారి
కేవల నామస్మరణ
విసుగురావచ్చునేమో!
కాని నామస్మరణ
స్వరరాగ లయబద్ధమైతే
పాడేవారికి వినేవారికి
వీనులవిందుగానుండి
మనసునాహ్లాద పఱచుననుట
తెలిసినవిషయమే.
ఆసంగీతమాధుర్యములో
మననలను మనమే మఱచిపోతాము.
ఆవిధముగానైనా
భగవన్నామ స్మరణముచేయటము
తటస్థపడుతుంది. త్యాగరాజస్వామి
మధురముగా గానము
చేయలేదా "సుఖి
యెవెరో సుఖి యెవెరో
రామనామ సుఖి యెవరో
---- తెలిసి రామ చింతనతో
నామము సేయవే ఓమనసా
--- రామనామం భజరే
మానస ---- రామ కోదండ
రామ కల్యాణ రామ
---- మేలుమేలు రామనామ
సుఖమీధరలో" ఇత్యాది
కీర్తనలు బహుళ
ప్రచారములో నున్నవి. రామదాసుగారు
"రామ రామ నీనామమెంతో
రుచిరా - పావనరామ
నీనామ సుధారసపానము
చేసేదెన్నటికో
--- రామనామమే జీవనము
అన్యమేదిరా కృపావనము
--- ఓ రామ నీనామమేమి
రుచిరా -- ఇత్యాది కీర్తనలను"
ఆవేశముతో పాడారు.
అన్నమయ్యగారు
అనన్యమైన పదసంకిర్తనలలో
హరిని హరిగుణవర్ణనలను
అనేకములు అద్వితీయముగా
పాడి తరించారు.
పూర్వాశ్రమములో
కిరాతుడుగనుండి
అజ్ఞానుడయ్యూ
"మరా మరా" అనుచు
[రామ రామ అనుట తెలియక]
పునీతుడై ఆదికవిగా
ప్రసిద్ధిచెందిన
వాల్మీకియై శ్రీమద్రామాయణము
వ్రాసి తరించలేదా!
సర్వోపనిషత్సారమైన
భగవద్గీత ప్రబోధనలో
శ్రీకృష్ణ పరమాత్మ
ప్రస్ఫుటముచేసెనే
"నామస్మరణమే భక్తి
జ్ఞాన యోగములకు
ముఖ్య సాధనములు
బ్రహ్మజ్ఞాన సముపార్జనకని".
విధివిధానముగ సలుపు సర్వగుణకరలన్నియ (పరమాత్మ
సంధానముకాని, ప్రతిఫలాక్ష
నాసించు పూజాపునస్కారాలు యజ్ఞయాగాదులన్నియు) వ్యర్థములు , పరమాత్మపరమైన
నిష్ఫలకాంక్షతో
చేయు కర్మలే ఆత్మతత్త్వమరయు
సత్సాధనములనెనే
భగవద్గీత. అంతటి పరతత్త్వము పొందుసులభ సాధనము నామస్మరణమే. నామస్మరణము చేయుటకు ప్రయాసపడ
నక్కరలేదు. గుణకర్మలు చేయ నవసరము లేదు. సర్వకాల సర్వావస్థలలో హరినామ స్మరణము
చేయుటకు అడ్డువచ్చునదేదియు లేదుగదా. నిరంతరము
నామస్మరణ చేయుసద్భక్తుడు
సర్వదా సర్వత్ర
హరినే చూచును.
అదియే పరిజ్ఞానము
బ్రహ్మజ్ఞానము.
వాడే అహంబ్రహ్మాస్మి
యనదగువాడు. అట్టివానికి
తరతమ భేదములు లేవు.
ద్వందాతీతుడుగదా.
ఇట్టి పరిజ్ఞానములేని
దాంతులు వేదాంతులు
చేయు గుణకర్మలన్నియు
నిరర్థకములే. మనమా
పరమాత్మను పలకరించిననే
పలుకుతాడు. కొలిచినవారికి
కొలిచినంత దైవమాయన.
కృతజ్ఞుడంటారాయనను.
ఆయన అతి సులభుడు.
భక్తులకు అతిచేరువనుండు
మహానుభావుడు. ఆయన
అత్యల్ప సంతోషి.
మనదగ్గరనుండి
యేమియూ కోరడు.
సదాసంతుష్టుడాయన.
మనసర్వ సంపదలను
ఆయురారోగ్యాలను
సంవృద్ధిచేయు
వృద్ధాత్మ. మన కామితార్థ
ఫలములనొసగు వరదుడు.
శ్రీహరి అనుగ్రహము
సంపాదించవలెనన్న
భక్తితో మనమిచ్చే
పత్ర పుష్ప ఫలతోయములలో
నేదైన చాలునట. మనముచేయు
పనులను సదా క్షణము
హోర విఘడియ ఘడియ
నిముషము దినము
మాసము ఋతువు అయనము
సంవత్సరమనెడి
కాలమానములలో పర్యవేక్షించునట, సంవత్సర రూపుడు, సమయజ్ఞుడు, కాలజ్ఞుడు, కాలాతీతస్వరూపుడగు ఆపరమాత్మ.
ఆయన అనుగ్రహము
లేనిదే జరుగదేక్షణము.
మనపలుకు కులుకు
తళుకులన్నీ జగదీశ్వరుని
కటాక్షము వలననేగదా.
ఈలోకములో వచ్చిన
దారి తెలియదు.
పోయే దారంతకన్నా
తెలియదు. మనకు
సద్గతిని ప్రసాదించి
మనశ్రేయస్సును
సరిజూచు మహాత్ముడుగాన
అగ్రణి గ్రామణి
అంటారాయనను. అంతాతానై
అన్నిటా వెలుగు
జగదేకపతిని ప్రతిదినము
ఒక్కక్షణమైనా
స్మరించిన చాలునీజన్మకు. లావొక్కింతయు
లేనప్పుడు ధైర్యము
విలోలమైనప్పుడు
కరీంద్రుడు హరినామ
స్మరణచేసినంతనే
హరిశీఘ్రమేతెంచి
కరినిగాచినది
తెలిసిన విషయమేగదా!
మానవతి పాంచాలి
మొరపెట్టిననే
వేగమేగాచిన హరికథ
తెలియునుగదా! నామి
యెక్కడున్నా నామస్మరణమాత్రాన
దీనజనార్తిని
హరించునే
హరి,కాలుడడ్డువచ్చినా!
విష్ణుసహస్రనామ
సంకీర్తనములో
"ఆర్తా విషణ్ణా
శిధిలాశ్చ భీతా
ఘొరేషుచ వ్యాధిషు
వర్తమానాః సంకీర్త్య
నారాయణ శబ్దమాత్రం
విముక్తా దుఃఖా
స్సుఖినోభవంతి"
యని ప్రస్ఫుటముచేయలేదా! అక్షరపరబ్రహ్మంబైన
శ్రీహరినరయుటకు
విష్ణుసహస్ర నామావళిని
భావార్థస్ఫూర్తితో
సద్భక్తితో సంకీర్తించవలెను.
సర్వవ్యాప్తమైన
ఓంకారమునుండే
అక్షరములు, ఆయక్షరములనుండే
పదజాలము, పదజాలమునుండి
సర్వత్ర వాడుకలోనున్న
భాష ఏర్పడినది.
అందువలననే యీవిశ్వమంతా
నాదాత్మకమను ప్రతీతి
గలదు విశ్వమందు.
మనసంగీత సాంప్రదాయము
నాదవిద్యయని ప్రసిద్ధిచెందినది.
ఇది జగద్విదితము.
స్వరార్ణవ గ్రంథమునందు
చెప్పబడినటుల
సర్వము నాదాత్మకము
ఆపరబ్రహ్మమైన
విష్ణువేగదా! స్వల్పమైన
అశాశ్వతమైన సుఖశాంతుల
కోసమై భూపతుల నామస్మరణ, వారికివ్యర్థమైన
సేవలు చేయనేల!
సర్వాంతర్యామి
సర్వజగదాధిపతి
శ్రీపతియగు హరినామస్మరణమే
శరణ్యము సర్వదా చరాచరములకు. నాకు
తెలుగులో ప్రవేశమంతంత
మాత్రమే. నాకు
సంగీతములో ప్రవేశము
అతిస్వల్పము. నేను
సుప్రసిద్ధ సంగీత
విద్వాంసులు బ్రహ్మశ్రీ ర్. ర్
. కేశవమూర్తి గారి
(బెంగుళూరు) వద్ద వయొలిన్
వాద్యము నేర్వ
ప్రయత్నించితిని
(నాలుగు దశాబ్దముల
వెనుక). నావ్యక్తిగత
కారణములవల్ల నేనునేర్చినదేమియు
లేదు. కాని సద్గురు
సాంగత్యమువలన
కర్ణాటక సంగీతమంటే
చాలశ్రద్ధ వ్యామోహాలు
కలిగినవి. కీర్తిశేషులు
ద్వారం వేంకటస్వామి
గారు, కీర్తిశేషులు
ఈమని శంకరశాస్త్రి
గారు, కీర్తిశేషులు
మహారాజపురం సంతానం
గారు, కీర్తిశేషులు మ్
.ల్
. వసంతకుమారి
గారు, కీర్తిశేషులు
శెమ్మనగుడి శ్రీనివాస
అయ్యంగారు, కీర్తిశేషులు
శ్రీమతి సుబ్బలక్ష్మిగారు, శ్రీమంగళంపల్లి
బాలమురళీకృష్ణ
గారు, శ్రీ
నేదునూరి కృష్ణమూర్తి
గారు, మాణ్డలీన్
శ్రీనివాసు గారు, శ్రీకదిరి
గోపీనాథ్ గారు --
మొదలగు ఘన విద్వాంసుల
రికార్డులు తఱచు
వినగా వినగా ఈమధ్య కాలములో
"స రి గ మ ప ద ని ల"సంచారము కొంచెము
కొంచెము తెలిసికొనగలుగుచున్నాను.
అదియంతయూ భగవద్ప్రేరణయే. నాకు
తెలిసిన విషయాలు
బహుస్వల్పము మాత్రమే.
నాకు తెలియనివెన్నో నేలెక్కపెట్టలేను.
కాని భగవత్ప్రేరణ
లేకుండా జరిగేదేది
లేదు. భగవదనుగ్రహము వలన నేజేసినట్టి
యీ హరిదాస సంకీర్తనల
( ౧.
శ్రీవిష్ణుసహస్రనామ సంకీర్తన మంజరి , ౨. శ్రీహరిదాస
పదములు, ౩. శ్రీహరిగీతానంద
లహరి, ౪. శ్రీహరిభక్తి
తత్త్వానంద లహరి
) సంకలనమంతా చంద్రునికొక
నూలుప్రోగు లాంటిదే.
ఈవిషయములో నాప్రతాపమేమి
లేదు. అంతా కాకతాళీయ
సంఘటనము. ఆపరమాత్ముని
సంకల్పము అనుగ్రహమే.
రామదాసు అన్నమయ్య
పురందరదాసు త్యాగరాజాది
హరిదాసులు కారణజన్ములు.
సద్భక్తిసహిత
సంగీతజ్ఞానముతో
హరినామసంకీర్తనముచేసి
దివ్యదర్శనముపొంది
తరించారు. అట్టి
మహానుభావులందరికి
నాపాదాభివందనములు. శ్రీహరిదాస
సంకీర్తనములను
విమర్శనముచేసి
తగు సలహాలనిచ్చిన
ప్రముఖులు, శ్రీ తిరుమల
కృష్ణ దేశికాచారి
గారు, కీర్తిశేషులు
శ్రీ ఓగేటి పరీక్షిత్
శర్మగారు, శ్రీ మంగళంపల్లి
బాలమురళీకృష్ణ
గారు, శ్రీ
నల్లాన్చక్రవర్తుల
కృష్ణమాచారి గారు, శ్రీ పప్పు
వేణు గోపాలరావు
గారు, శ్రీ
కొండేపూడి వేంకట
సుబ్బారావు గారు,
నామేనమామగారు కీర్తిశేషులు శ్రీ అయాచితుల
హనుమచ్ఛాస్త్రిగారు,శ్రీ విశ్వనాథ అచ్యుత దేవరాయలు గారు, నామిత్రుడు
ఊటుకూరి రాజరాజనరేంద్రులకు
నాధన్యవాదములు. నాదాత్మకమైన
శ్రీమహావిష్ణువే
సర్వజ్ఞుడు. ఆసర్వేశ్వరుని
నామరూపాల భావార్థములు
మిడిమిడిజ్ఞానముగల
నాకవగతమగునా! చతుష్షష్ఠికళానిధియగు
శ్రీహరిని విశదీకరించగల
శక్తి ఆపరమాత్మకే
చెల్లును. సర్వనామధారియైన
శ్రీహరి స్వరూపవిభవాలను
సంకీర్తింప సాధ్యమా
అనామకుడైన నాకు!
ఐనా సాహసించి సంకలనముచేసిన
శ్రీహరిదాస సంకీర్తనములలో
కనబడు భావార్థములలోని
తప్పులన్నీ నాస్వయంకృతాపరాధములే.
ఓప్పులన్నీ భగవదనుగ్రహముగా
గాయనీగాయకబృందము
పండితులు గ్రహింతురుగాక!.
ఈకీర్తనల రచయిత
యోగ్యతలను శోధించక
కీర్తనలందలి సద్వస్తువిషయమును
పరిగ్రహించ వలసినదిగా
నామనవి నాప్రార్థన. కొద్దికాలముక్రింద
కొన్ని శ్రీహరిదాస
సంకీర్తనములను
శ్రీ మంగళంపల్లి
బాలమురళీకృష్ణ
గారు, శ్రీమతి చెరువు
సుందరమ్మగారు (AIR Artist), నామేనకోడలు
లలిత (AIR Artist,
సప్తస్వరార్ణవ
ప్రేరితులై నలుగురు
నాలుగు విధములుగా
యీకీర్తనసంపుటిని
స్వరపఱచి శ్రీహరినామసుధా
రసముచే రంజిల్లు
మధురగానములో మనయింద్రియాలను
ఆనందామృతవర్షిణిలో
పరవశము చేయు మధురక్షణము
దగ్గరలోనే ఉన్నదని
ఆశిస్తునాను. నాకృషిలో
దైవకృపతోబాటు
అహర్నిశలు నాకు
చేయూతనిచ్చి కార్యసాఫల్యమగునటుల
చేసిన నాభార్య
వరలక్ష్మిని వేనోళ్ళ
పొగడినా చాలదు.
ఇంతటి మహాకార్యమును
ప్రోత్సహించి
సర్వదా కార్యసిద్ధికి
మూలకారణమైన ఆసర్వేశ్వరునకే
యీశ్రీహరిదాస
సంకీర్తనములను
అంకితముచేయుచున్నాను. ఓం
తత్సద్బ్రహ్మార్పణమస్తు శిష్ట్లా శ్రీరామచంద్రమూర్తి
|